Jagan: జగన్‌కు నోటీసులిచ్చాం.. వాంగ్మూలం ఇస్తే సంతోషిస్తాం: సీపీ

  • హైకోర్టును ఆశ్రయించిన జగన్
  • హైకోర్టు విచారణానంతరం వివరాలు వెల్లడిస్తాం
  • ఇక ముందు కూడా జగన్‌కు భద్రత కల్పిస్తాం
వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన కోడికత్తి దాడి ఘటన ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ దాడిపై జగన్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. జగన్ ఏపీ పోలీసులకు వాంగ్మూలం ఇవ్వకపోవడంపై కోర్టు సీరియస్ అయింది. అయితే ఇప్పటికైనా జగన్ వాంగ్మూలం ఇస్తే సంతోషిస్తామని విశాఖ సీపీ మహేష్ చంద్ర లడ్డా పేర్కొన్నారు.

దాడి కేసులో విచారణను వేగవంతం చేశామని.. హైకోర్టు విచారణానంతరం వివరాలు వెల్లడిస్తామని సీపీ తెలిపారు. ఏడాది కాలంగా జగన్ పాదయాత్రకు భద్రత కల్పించామని.. ఇకముందు కూడా కల్పిస్తామని లడ్డా స్పష్టం చేశారు. జగన్ వాంగ్మూలం కోరుతూ నోటీసులిచ్చామని.. ఆయన వాంగ్మూలం ఇస్తే సంతోషిస్తామని లడ్డా పేర్కొన్నారు.
Jagan
Mahesh chandra Ladda
Visakha Airport
High Court

More Telugu News