Revanth Reddy: విజయశాంతితో రేవంత్‌రెడ్డి భేటి.. పలు అంశాలపై చర్చ

  • విజయశాంతి నివాసంలో భేటీ
  • మూడు గంటలపాటు జరిగిన సమావేశం
  • టీఆర్ఎస్‌ను ఎలా ఎదుర్కోవాలనే దానిపై చర్చ
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఆ పార్టీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ విజయశాంతితో సమావేశమయ్యారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభ సమయంలో జరిగిన ఈ సమావేశం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయశాంతి నివాసంలో ఈ సమావేశం జరిగింది.

దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్‌ను ఎలా ఎదుర్కోవాలి? అసంతృప్తుల బారి నుంచి పార్టీని ఎలా రక్షించుకోవాలి? అలాగే సీట్ల సర్దుబాటుపై ఎదురవుతున్న నిరసనలు... మహాకూటమిలోని పార్టీలకు కేటాయించే సీట్లు తదితర అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం.
Revanth Reddy
Vijayashanthi
TRS
Congress

More Telugu News