Telangana: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. నాలుగు రోజుల పాటు మద్యం షాపులు బంద్

  • ఎన్నికల నేపథ్యంలో మందుబాబులకు ఇక్కట్లు
  • డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం నుంచి 7వ తేదీ సాయంత్రం వరకు షాపులు బంద్
  • ఓట్ల లెక్కింపు జరిగే 11వ తేదీన కూడా మూతపడనున్న షాపులు

ఎన్నికల నేపథ్యంలో మందుబాబులకు ఇక్కట్లు తప్పేలా లేవు. ఎన్నికలు జరిగే డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి. తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 7న ఎన్నికలు జరగనుండగా... 11వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో 5వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు షాపులు మూత పడనున్నాయి. అదే విధంగా 11వ తేదీన కూడా షాపులు బంద్ కానున్నాయి. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. 

More Telugu News