Telangana: హైదరాబాద్ లో మందు కొట్టి కారుతో బీభత్సం సృష్టించిన మహిళ.. అరెస్ట్!

  • కారును వేగంగా నడిపిన నిందితురాలు
  • ఎదురుగా వెళుతున్న కారును ఢీకొట్టిన వైనం
  • స్థానికుల ఫిర్యాదుతో అరెస్ట్ చేసిన అధికారులు

హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఓ మహిళ కారుతో బీభత్సం సృష్టించింది. పూటుగా మద్యం తాగి కారును వేగంగా నడుపుతూ అటుగా వెళుతున్న కారును ఢీకొట్టింది. ఇదేంటని ప్రశ్నించిన స్థానికులతో ఆమె వాగ్వాదానికి దిగింది. దీంతో వారంతా మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించారు.

ఈ నేపథ్యంలో ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు.. అనుమానంతో బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా 130 పాయింట్లు వచ్చాయి. దీంతో ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించగా, అక్కడ కూడా అధికారులపై నిందితురాలు చిందులు వేసింది. స్టేషన్ లోని సామగ్రిని ధ్వంసం చేసింది. ఆ మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు మరికాసేపట్లో కోర్టులో హాజరుపర్చనున్నారు.

More Telugu News