Chandrababu: చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన స్టాలిన్, కనిమొళి

  • విమానాశ్రయం నుంచి నేరుగా స్టాలిన్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు
  • సాదరంగా ఆహ్వానించిన స్టాలిన్, కనిమొళి, సీనియర్ నేతలు
  • భవిష్యత్ కార్యాచరణపై చర్చ

డీఎంకే అధినేత స్టాలిన్ తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. మహాకూటమి ఏర్పాటులో భాగంగా చర్చించేందుకు చెన్నై వెళ్లిన చంద్రబాబు... విమానాశ్రయం నుంచి నేరుగా స్టాలిన్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు స్టాలిన్, కనిమొళితో పాటు డీఎంకే సీనియర్ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరంతా భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

More Telugu News