Andhra Pradesh: దుర్గగుడిలో మొమెంటోల కుంభకోణం.. హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఏఈవో అచ్యుతరామయ్య!

  • తనను అన్యాయంగా ఇరికించారని వెల్లడి
  • ఈవో ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి 
  • ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన హైకోర్టు
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మొమెంటో కుంభకోణం వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆలయ నిధుల దుర్వినియోగం ఆరోపణలతో సస్పెన్షన్ కు గురైన అసిస్టెంట్ ఈవో అచ్యుతరామయ్య ఈ రోజు ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. తనను అన్యాయంగా విధుల నుంచి తప్పించారని పిటిషన్ లో పేర్కొన్నారు. కనీసం తన వాదనను కూడా వినలేదనీ, తన సస్పెన్షన్ అక్రమమని వాదించారు. తన సస్పెన్షన్ పై స్టే ఇవ్వాలని, ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని కోరారు.

ఈ పిటిషన్ లో ఏపీ దేవాదాయ కమిషనర్ తో పాటు ఆలయ ఈవో కోటేశ్వరమ్మను ప్రతివాదులుగా చేర్చారు. ఈ నేపథ్యంలో వీరిద్దరికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. అమ్మవారి ఆలయంలో 1,200 మొమెంటోలు కొనుగోలు చేసిన అధికారులు ఆ సంఖ్యను మాత్రం 2,000గా చూపారు. ఆడిటింగ్ లో ఈ వ్యవహారం బయటపడటంతో ఏఈవో అచ్యుతరామయ్య సహా ముగ్గురిని బాధ్యులుగా తేల్చారు. దీంతో వీరిని విధుల నుంచి తప్పిస్తూ ఈవో కోటేశ్వరమ్మ నిర్ణయం తీసుకున్నారు.
Andhra Pradesh
Vijayawada
durga
temple
momento
scam
Police
High Court
petition
stay
order

More Telugu News