bellamkonda srinivas: పవర్ ఫుల్ టైటిల్ గా 'కవచం' .. బెల్లంకొండ శ్రీనివాస్ ఫస్టులుక్ రిలీజ్

  • శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వంలో 'కవచం'
  • పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీనివాస్
  • సంగీత దర్శకుడిగా తమన్      
మొదటి నుంచి కూడా బెల్లంకొండ శ్రీనివాస్ మాస్ ఆడియన్స్ మెచ్చే సినిమాలు చేస్తూ వాళ్లకి చేరువవుతున్నాడు. అలాగే తన తదుపరి సినిమా కూడా మాస్ ఆడియన్స్ కి నచ్చేలా ఉండేలా చూసుకున్నాడు. 'సాక్ష్యం' తరువాత ఆయన శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి 'కవచం' అనే పవర్ఫుల్ టైటిల్ ను ఖరారు చేసి, తాజాగా ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు.

ఈ ఫస్టు లుక్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్ గా శ్రీనివాస్ పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడనిపిస్తోంది. ఒక కథానాయికగా కాజల్ .. మరొక కథానాయికగా మెహ్రీన్ కనిపించనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు 'తేజ' దర్శకత్వంలోను శ్రీనివాస్ ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలోనూ కథానాయిక కాజల్ కావడం విశేషం.     
bellamkonda srinivas
kajal
mehreen

More Telugu News