karthikeya: 'ఆర్ ఎక్స్ 100' హీరో స్పీడ్ మీదే వున్నాడు

  • కార్తికేయ నెక్స్ట్ మూవీగా 'హిప్పీ'
  • ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ 
  • తెలుగు .. తమిళ భాషల్లో నిర్మాణం

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఆర్ ఎక్స్ 100' సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాతో హీరో కార్తికేయ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతో ఆయనతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా తన స్పీడ్ ను పెంచేస్తూ ఒక ద్విభాషా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు

తమిళ దర్శకుడు టి.ఎన్. కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. తెలుగు .. తమిళ భాషల్లో రూపొందే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు మొదలు కానుంది. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమవుతోన్న ఈ సినిమాకి 'హిప్పీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. మొత్తానికి చాలా తక్కువ సమయంలోనే కార్తికేయ తమిళ ప్రేక్షకులకి కూడా పరిచయం కానున్నాడన్న మాట.  

More Telugu News