Chandrababu: నేటి సాయంత్రం చెన్నైకి చంద్రబాబు.. స్టాలిన్‌తో చర్చలు

  • ప్రత్యేక విమానంలో సాయంత్రం చెన్నైకి
  • స్టాలిన్‌తో గంటపాటు చర్చలు
  • స్టాలిన్‌తో చర్చల అనంతరం తిరిగి హైదరాబాద్‌కు

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, జేడీఎస్ చీఫ్ హెచ్‌డీ దేవెగౌడతో గురువారం చర్చలు జరిపిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు చెన్నై వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 6 గంటలకు చెన్నై చేరుకుంటారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అళ్వార్‌పేటలో ఉన్న డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ నివాసానికి చేరుకుంటారు. అనంతరం గంటపాటు ఇరువురు నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పలువురు నేతలు కూడా పాల్గొననున్నారు. అనంతరం చెన్నై విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమనాశ్రయానికి చేరుకుంటారు.

కేంద్రంలోని ఎన్‌డీయే ప్రభుత్వం ఏపీకి తీరని ద్రోహం చేస్తోందని, ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు పన్నుతోందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘సేవ్ కంట్రీ.. సేవ్ డెమోక్రసీ’పేరుతో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

అందులో భాగంగా ఇటీవల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని కలిసిన చంద్రబాబు.. గురువారం బెంగళూరులో ముఖ్యమంత్రి కుమారస్వామి, జేడీఎస్ చీఫ్ దేవెగౌడలను కలిసి కూటమిపై  చర్చించారు. నేడు స్టాలిన్‌ను కలిసి కూటమికి రూపురేఖలు తీసుకురాన్నారు.

More Telugu News