Harish Rao: పదవులను వారు పంచుకున్న తర్వాతే ఇతరులకు కేటాయిస్తారు!: కేసీఆర్ కుటుంబంపై రేవంత్ విమర్శలు

  • మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే సీఎం ఎంపిక
  • టీఆర్ఎస్‌లో అభిప్రాయాలకు తావు లేదు
  • ముందుగా కేసీఆర్ కుటుంబం పదవులను పంచుకుంటుంది
టీఆర్ఎస్‌లో సీఎంనే కాదు, కనీసం మంత్రులను నిర్ణయించే సమయంలో సైతం ఏ ఒక్కరి అభిప్రాయాలకూ తావుండదని కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ సీట్ల కేటాయింపుపై కసరత్తు జరుగుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... మహాకూటమిపై మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు చేస్తున్నవిమర్శలపై మండిపడ్డారు.

సీల్డ్ కవర్ సీఎం కావాలా? అని కేటీఆర్ ప్రశ్నించడంపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే సీఎం ఎంపిక ఉంటుందని తెలిపారు. ఈ విషయం గత చరిత్ర చూస్తే ఎవరికైనా అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్‌లో సీఎం, మంత్రుల ఎంపికలో అభిప్రాయ సేకరణ అనేదే ఉండదని రేవంత్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబంలోని వారు పదవులను పంచుకున్న అనంతరం మిగిలినవి ఇతరులకు కేటాయిస్తారన్నారు.
Harish Rao
KTR
KCR
Revanth Reddy
New Delhi
Congress

More Telugu News