Uttar Pradesh: చిన్నారి నోట్లో బాంబు పెట్టి పేల్చిన ఆకతాయి... 50 కుట్లు!

  • యూపీలోని మీరట్ సమీపంలో ఘటన
  • చిన్నారి నోట్లో సుట్లీ బాంబు పేల్చిన బాలుడు
  • విషమంగా బాలిక పరిస్థితి

దీపావళి పండగ నాడు ఓ ఆకతాయి చేసిన పని మూడేళ్ల చిన్నారిని తీవ్రగాయాలపాలు చేసింది. మీరట్ సమీపంలోని మిలక్ గ్రామం దొరాలా రోడ్డులో చిన్నారులంతా రహదారిపై టపాకాయలు కాలుస్తున్న వేళ, మూడేళ్ల చిన్నారి నోట్లో 'సుట్లీ బాంబ్'ను పెట్టి అంటించాడు. అది పేలడంతో ఆ చిన్నారి గొంతు భాగం పూర్తిగా దెబ్బతింది.

పాపను వెంటనే ఆసుపత్రికి తరలించగా, వైద్యులు 50 కుట్లు వేశారు. పాప పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. చిన్నారి నోట్లో హర్పాల్ అనే బాలుడు ఈ బాంబును పేల్చగా, బాధితురాలి తండ్రి శశికుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. హర్పాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News