Attingal: కూలిన విజయ్ భారీ కటౌట్.. నాలుగు బైకులు ధ్వంసం.. పగిలిన థియేటర్ అద్దాలు

  • 50 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసిన అభిమానులు
  • పాలాభిషేకం చేసిన కాసేపటికే కూలిన వైనం
  • కోర్టు బయట సమస్య పరిష్కారానికి అంగీకారం

కేరళలోని ఓ థియేటర్‌లో నటుడు విజయ్ అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కటౌట్ కూలిన ఘటనలో నాలుగు ద్విచక్ర వాహనాలు, థియేటర్ అద్దాలు ధ్వంసమయ్యాయి. అత్తింగళ్‌లోని గంగ థియేటర్‌‌లో ఈ ప్రమాదం జరిగింది. విజయ్ సర్కార్ సినిమా సందర్భంగా అభిమానులు 50 అడుగుల ఎత్తున్న భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం దీనికి పాలాభిషేకం చేశారు.

అయితే, ఆ తర్వాత కాసేపటికే కటౌట్ పెద్ద శబ్దం చేస్తూ కూలిపోయింది. థియేటర్ లోపల ఇది పడడంతో హాల్ అద్దాలు బద్దలవడంతోపాటు నాలుగు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై థియేటర్ యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. అభిమాన సంఘంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, సమస్యను కోర్టు బయట పరిష్కరించుకునేందుకు ఇరు వర్గాలు అంగీకారానికి రావడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

More Telugu News