AR Murugadoss: థ్యాంక్యూ సర్.. మీకు నచ్చినందుకు!: మహేశ్‌కు కృతజ్ఞతలు చెప్పిన మురుగదాస్

  • హిట్ టాక్ తెచ్చుకున్న సర్కార్
  • రికార్డు కలెక్షన్లు
  • మహేశ్‌‌కు సినిమా నచ్చినందుకు ఆనందంగా ఉందన్న మురుగదాస్
టాలీవుడ్ స్టార్ హీరో మహశ్‌బాబుకు ‘సర్కార్’ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ థ్యాంక్స్ చెప్పాడు. బాక్సాఫీసును కొల్లగొడుతున్న సర్కార్ సినిమాను మహేశ్ బాబు ప్రశంసించాడు. సినిమా చాలా బాగుందని, తానైతే బాగా ఎంజాయ్ చేశానంటూ ట్వీట్ చేశాడు. చిత్ర బృందానికి అభినందనలు చెబుతూ.. ఇది మురుగదాస్ ట్రేడ్ మార్క్ సినిమా అని ప్రశంసల వర్షం కురిపించాడు.

మహేశ్ ట్వీట్‌తో ఉబ్బితబ్బిబ్బయిన మురుగదాస్ రిప్లై ఇస్తూ.. 'సినిమా నచ్చినందుకు కృతజ్ఞతలు సార్. మీకు నచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది' అని ట్వీట్ చేశాడు.  కాగా, మంగళవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా బాక్సాఫీసును కొల్లగొడుతోంది. వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తెలుగునాట కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.  
AR Murugadoss
Mahesh Babu
Sarkar
Vijay
Tamil
Tollywood

More Telugu News