Sarkar: బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న ‘సర్కార్’

  • నెగిటివ్ టాక్‌ను పట్టించుకోని అభిమానులు
  • తెలుగు రాష్ట్రాల్లోనూ దూసుకుపోతున్న ‘సర్కార్’
  • ఓవర్సీస్‌లో కలెక్షన్ల వర్షం
తమిళ నటుడు, ఇళయ దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం సర్కార్ బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. మంగళవారం విడుదలైన ఈ సినిమా ఒక్క రోజులోనే భారీ వసూళ్లతో రికార్డు సృష్టిస్తోంది. చెన్నైలో 70 స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమా ఒక్క రోజులోనే రూ. 2.41 కోట్లు వసూలు చేసింది.

ఇక, ఓవర్సీస్‌లో అయితే చెప్పనక్కర్లేదు. కలెక్షన్ల సునామీతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే మొదటి రోజు రూ. 2.32 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. సినిమా పట్ల కొంత నెగిటివ్ టాక్ ఉన్నప్పటికీ వసూళ్లపై ఆ ప్రభావం కనిపించకపోవడం విశేషం.

 ఈ సినిమాకు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించగా కీర్తి సురేశ్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. కాగా, విజయ్ గత సినిమా మెర్సల్ (అదిరింది) కూడా తెలుగులో హిట్టయిన సంగతి తెలిసిందే.
Sarkar
Vijay
kollywood
Tamil Nadu
AR Murugadoss
Varalaxmi Sarathkumar

More Telugu News