New Delhi: తాగుబోతు నిర్వాకం.. కాలి బూడిదైన 18 వాహనాలు!

  • ఢిల్లీలోని మదన్ గిర్ ప్రాంతంలో ఘటన
  • బైక్ లకు నిప్పు పెట్టిన ప్రబుద్ధుడు
  • కేసు నమోదుచేసిన పోలీసులు
దేశరాజధానిలో పూటుగా మందుకొట్టిన ఓ ఆకతాయి రెచ్చిపోయాడు. వాహనాల ట్యాంకు మూతలు తెరిచి అగ్గిపెట్టెతో మంట పెట్టాడు. ఈ ఘటనలో 18 వాహనాలు కాలిబూడిద అయ్యాయి. వాహనాలకు మంటపెట్టిన అనంతరం నిందితుడు ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.

ఇక్కడి మదన్ గిర్ ప్రాంతంలో ఈ రోజు ఉదయం 3.05 గంటలకు రోడ్డుపై పార్క్ చేసిన బైక్ లు, కార్ల వద్దకు వచ్చిన నిందితుడు.. తొలుత బైక్ ఆయిల్ ట్యాంక్ మూతలను విప్పాడు. అనంతరం అగ్గిపుల్లతో మంటపెట్టాడు. ఈ మంటలు ఒక్కసారిగా అన్ని బైక్ లకు వ్యాపించడంతో అక్కడి నుంచి పారిపోయాడు.

అయితే మంటలు అక్కడితో ఆగకుండా పక్కనే పార్క్ చేసిన కార్లకు సైతం అంటుకున్నాయి. దీంతో 14 టూ వీలర్లు, 4 కార్లు కాలి బూడిద అయ్యాయి. మంటలు చూసిన కొందరు స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 
New Delhi
drunker
set fir
tourched
burned
fire
Fire Accident
Police
madan gir
18 vehiles
ashes
bikes
cars

More Telugu News