diwalai: దీపావళి పండుగ.. ట్విట్టర్ లో స్పందించిన ఏపీ మంత్రి నారా లోకేశ్!

  • చీకటిని తరిమికొట్టడమే దీపావళి లక్ష్యం
  • మన సంస్కృతి ఇస్తున్న సందేశమిదే
  • కాలుష్య రహితంగా దీపావళి జరుపుకోవాలని పిలుపు

దీపావళి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలకు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఒక్కొక్క చిరుదివ్వె కోటి దివ్వెలై సహస్రకోటి కాంతులతో చీకటిని తరిమికొట్టే పోరాటమే దీపావళి అని అన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలపై గెలిచేందుకు మన సంస్కృతి ఇస్తున్న సందేశమే ఈ పండుగని పేర్కొన్నారు. శుభాలను తెచ్చే దీపావళి పండుగను కాలుష్య రహితంగా, సురక్షితంగా జరుపుకోవాలని ప్రజలను కోరారు.

ఈ రోజు ట్విట్టర్ లో దీపావళి  నేపథ్యంలో లోకేశ్ స్పందిస్తూ.. ‘ఒక్కొక్క చిరుదివ్వె కోటి దివ్వెలై సహస్రకోటి కాంతులతో చీకటిని తరిమికొట్టే పోరాటమే దీపావళి. సమస్యలపై గెలిచేందుకు ఇది మన సంస్కృతి ఇస్తున్న సందేశం. శుభాలను ఆహ్వానించే దీపాలపండుగను కాలుష్యరహితంగా, సురక్షితంగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.

More Telugu News