Jagan: జగన్ కోలుకోవాలంటూ.. మోకాళ్లపై గుడి మెట్లు ఎక్కిన మాజీ ఎమ్మెల్యే!

  • పశ్చిమగోదావరి జిల్లాలో ఘటన
  • మొక్కు చెల్లించుకున్న వైసీపీ నేత బాలరాజు
  • వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయమని ధీమా
వైఎస్ జగన్ పై ఇటీవల విశాఖపట్నం విమానాశ్రయంలో శ్రీనివాసరావు అనే యువకుడు కోడి కత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. గాయం కారణంగా జగన్ విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న తన ప్రజాసంకల్ప యాత్రను సైతం వాయిదా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఆరోగ్యం మెరుగవ్వాలని కోరుతూ ఓ మాజీ ఎమ్మెల్యే మోకాళ్లపై గుడి మెట్లు ఎక్కారు.

వైసీపీ రాష్ట్ర ఎస్టీ విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పశ్చిమగోదావరిలోని గుబ్బల మంగమ్మతల్లి ఆలయానికి వెళ్లారు. మోకాళ్లపై గుడి మెట్లు ఎక్కి పైకివెళ్లిన బాలరాజు మంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జగన్ కు ఏమీ కాదని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. కోట్లాది మంది తెలుగు ప్రజలు జగన్ కు తోడుగా ఉన్నారని తెలిపారు.
Jagan
Andhra Pradesh
West Godavari District
temple
by walk

More Telugu News