Chattisghad: ఆమె ఆస్తి రూ. 1,200 మాత్రమే... సీఎంకే సవాల్!

  • రమణ్ సింగ్ పై బరిలోకి దిగిన ప్రతిమా వాస్నిక్
  • ఎన్నికల ఫండ్ రూ. 20 వేలు మాత్రమే
  • పోటీలో వాజ్ పేయి మేనకోడలు కరుణా శుక్లా కూడా

ఆమె పేరు ప్రతిమా వాస్నిక్. ఆస్తి కేవలం రూ. 1,200. ఆమెపై ఇప్పుడు చత్తీస్ గఢ్ లో చర్చలు నడుస్తున్నాయి. బీజేపీ తరపున ముఖ్యమంత్రి రమణ్ సింగ్, కాంగ్రెస్ తరఫున వాజ్ పేయి మేనకోడలు కరుణా శుక్లా పోటీలో ఉన్న రాజ్ నందన్ గావ్ నుంచి ఆమె కూడా పోటీ పడుతోంది.

నామినేషన్ లో వెల్లడించిన వివరాల ప్రకారం రమణ్ సింగ్ ఆస్తి రూ. 10.72 కోట్లు కాగా, కరుణా శుక్లా ఆస్తి రూ. 3 కోట్లు. వారితో పోటీ పడుతున్న ప్రతిమ ఆస్తి కేవలం రూ. 1,200. ఎన్నికల ఫండ్ గా రూ. 20 వేలు మాత్రమే ఉన్నాయట. ఆమె భర్త స్థానికంగా ఓ హోటల్ లో వంటవాడు.

సమాజంలో మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో తాను బరిలోకి దిగానని, ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్నానని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు గుర్తింపు తీసుకురావడం, ఉద్యోగావకాశాలు మెరుగుపరచడం తన లక్ష్యాలని ప్రతిమ చెబుతున్నారు. కాగా, ఈ ప్రాంతంలో ఎస్సీల్లోని సత్నామీ వర్గానికి గణనీయమైన ఓట్లుండగా, ప్రతిమ ఏ మేరకు సత్తా చూపుతుందో వేచి చూడాలి.

More Telugu News