dk sivakumar: దక్షిణాదిలో రామ మందిరంలాంటి డ్రామాలు చెల్లవు.. ఈ ఫలితాలు బీజేపీకి చెంపపెట్టు: కర్ణాటక మంత్రి శివకుమార్
- దక్షిణాదిలో బీజేపీ ఎత్తుగడలు పారవు
- రామ మందిరం వంటి అంశాలు ఇక్కడ రాజకీయ అస్త్రాలు కాలేవు
- బీజేపీని ప్రజలు తిరస్కరిస్తున్నారు
కర్ణాటక ఉపఎన్నికలలో కాంగ్రెస్-జేడీఎస్ స్వీప్ చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మంత్రి శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు ఈ ఫలితాలు నిదర్శనమని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఎత్తుగడలు పారవని ఆయన అన్నారు.
రామ మందిరంలాంటి అంశాలను దక్షిణాదిలో రాజకీయ అస్త్రాలుగా మలచలేరని చెప్పారు. దక్షిణాది ప్రజలు సామాజిక, ఆర్థిక భద్రత, మెరుగైన పాలన, పారదర్శకత వంటివాటినే పట్టించుకుంటారని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తీర్పే అంతిమమని అన్నారు. బీజేపీని ప్రజలు తిరస్కరిస్తున్నారని... 2019లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారనే దానికి ఈనాటి ఫలితాలు ఒక ఉదాహరణ అని చెప్పారు.