charan: శత్రువులపై విరుచుకుపడుతోన్న చరణ్ .. 'వినయ విధేయ రామ' నుంచి ఫస్టులుక్

  • యాక్షన్ మోడ్ లో చరణ్ 
  • ఈ నెల 9న టీజర్ రిలీజ్ 
  •  సంక్రాంతికి సినిమా విడుదల  

బోయపాటి దర్శకత్వంలో చరణ్ కథానాయకుడిగా 'వినయ విధేయ రామ' సినిమా రూపొందుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమాలో, చరణ్ సరసన కథానాయికగా కైరా అద్వాని కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. దీపావళి కానుకగా కొంతసేపటి క్రితమే ఈ సినిమా నుంచి చరణ్ ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు.

బోయపాటి యాక్షన్ మార్క్ కి తగినట్టుగా, శత్రువులపై విరుచుకుపడుతూ చరణ్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. చరణ్ లుక్ ఆయన అభిమానులను ఖుషీ చేస్తుందనే చెప్పాలి. ఈ సినిమా నుంచి ఈ నెల 9వ తేదీన ఉదయం 10:25 గంటలకు టీజర్ ను వదలనున్నారు. వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో, ప్రశాంత్ .. స్నేహ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తారు. 

More Telugu News