Chandrababu: తెలుగు లోగిళ్లలో ఆనందమయ కాంతులు వెదజల్లాలి: చంద్రబాబు

  • కార్తీక దీపకాంతులకు దీపావళి నాంది పలుకుతుంది
  • దీపావళిని అందరూ సంబరంగా స్వాగతించాలి
  • మనిషిలో రాక్షసత్వం పోయి.. మానవత్వం పరిఢవిల్లాలి
దీపావళి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు లోగిళ్లలో ఆనందమయ కాంతులు వెదజల్లాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. కార్తీక దీపకాంతులకు దీపావళి నాంది పలుకుతుందని... ఈ పండుగను తెలుగువారంతా సంబరంగా స్వాగతించాలని చెప్పారు. తెలుగువారందరికీ శాంతి, సౌభాగ్యం, సర్వ సుఖాలను భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. మనిషిలో ఉన్న రాక్షసత్వం పోవాలని, మానవత్వం పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. ప్రజల కళ్లలో వెలుగులు చూడటమే తన కోరికని చెప్పారు.
Chandrababu
deepavali
greetings
Andhra Pradesh

More Telugu News