Secunderabad: సికింద్రాబాద్‌లో ఘోరం.. చిన్నారులకు నిప్పంటించి తల్లి ఆత్మహత్యాయత్నం!

  • మచ్చబొల్లారంలో ఘటన
  • ఓ చిన్నారి మృతి
  • తల్లీ కూతుళ్ల పరిస్థితి విషమం
సికింద్రాబాద్‌లో దారుణం జరిగింది. అల్వాల్ మచ్చ బొల్లారానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలపై కిరోసిన్ పోసి నిప్పంటించి, తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చుట్టుపక్కల వారు గమనించేలోపే ఘోరం జరిగిపోయింది. చిన్నారి హరిణి (11) మృతి చెందగా, మరో బాలిక వర్ష (13) తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన తల్లి చంద్రిక (34) పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు గాంధీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Secunderabad
Hyderabad
Mcha Bollaram
Ablaze
Mother
Children

More Telugu News