YSRCP: కాకి లెక్కలతో నష్ట పరిహారాన్ని పచ్చ చొక్కాలు హాంఫట్‌ చేశాయి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

  • సెంటు భూమి లేని వారు సైతం లబ్ధి పొందారు
  • శవాలపై పేలాలు ఏరుకుంటున్న పచ్చ చొక్కా నేతలు
  • వరుస ట్వీట్లలో ఆరోపించిన విజయసాయిరెడ్డి

తిత్లీ తుపాన్ బాధితులకు ఇచ్చిన నష్టపరిహారాన్ని టీడీపీకి చెందిన వారు గుటకాయస్వాహా చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు.

‘సెంటు భూమి లేని వారు సైతం 150 నుంచి 200 కొబ్బరి చెట్లు కోల్పోయినట్లు రాయించుకున్న ఘటనలు కోకొల్లలు! 0.30 సెంట్లు భూమి ఉంటే 3 ఎకరాలని నమోదు. ఎకరాకి 60 కొబ్బరి చెట్లు చొప్పున 3 ఎకరాలకు 180 చెట్లు. పరిహారం 2.70 లక్షలు. కాకి లెక్కలతో పచ్చ చొక్కాలు పరిహారాన్ని హాంఫట్‌ చేసిన తీరిది!’ అని ఓ ట్వీట్ లో విజయసాయిరెడ్డి ఆరోపించారు.

‘శవాలపై పేలాలు ఏరుకుంటున్నారు పచ్చ చొక్కా నేతలు! తిత్లీ తుపాను విధ్వంసంతో కొబ్బరి, జీడి, వరి రైతులు తమ జీవనాధారాన్ని కోల్పోయి సాయం కోసం దీనంగా ఎదురుచూస్తుంటే ఎన్యూమరేషన్‌ను హైజాక్‌ చేసిన పచ్చ చొక్కాలు దానిని కూడా గుటకాయ స్వాహా చేసి రైతుల నోట్లో మన్ను కొట్టారు’ అని మరో ట్వీట్ లో ఆయన ఆరోపించారు.

More Telugu News