lakshmis ntr: లక్ష్మీపార్వతి పాత్రలో రూపాలీ... కొట్టిపారేసిన రామ్ గోపాల్ వర్మ

  • సినిమాకు, రూపాలీకి సంబంధం లేదు
  • యూనిట్ సభ్యుల్లో ఒకరికి ఆమె స్నేహితురాలు
  • తిరుమల వెళ్లినప్పుడు మాతోపాటే ఆమె కూడా వచ్చింది
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో లక్ష్మీపార్వతి పాత్రను బాలీవుడ్ భామ రూపాలీ సూరి పోషించబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి రూపాలీ మాట్లాడుతూ, ఈ సినిమాలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. చాలా ఎక్సైటింగ్ గా ఉందని... త్వరలోనే అన్ని వివరాలు తెలుస్తాయని చెప్పింది. ఇది అద్భుతమైన కథ అని, పెద్ద సినిమా అని తెలిపింది.

మరోవైపు ఈ వార్తలను వర్మ ఖండించారు. లక్ష్మీపార్వతి పాత్రలో రూపాలీ నటిస్తోందనే వార్తలు ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. ఈ చిత్రానికి పనేచేసే యూనిట్ సభ్యుల్లో ఒకరికి రూపాలీ స్నేహితురాలని చెప్పారు. మేము తిరుమల వెళ్లినప్పుడు ఆమె కూడా మాతో వచ్చిందని... అంతకు మించి సినిమాకు, ఆమెకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
lakshmis ntr
lakshmiparvathi
rupali suri
ram gopal varma

More Telugu News