Telangana: ఫామ్ హౌస్ లో కూర్చుని మందుకొట్టడం ఒక్కటే కేసీఆర్ కు తెలుసు!: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి

  • ఆయనకు ప్రజా సమస్యలు పట్టవు
  • తాగుబోతు నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయండి
  • నర్సాపూర్ లో కాంగ్రెన్ ను గెలిపించండి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజా సమస్యలు ఏవీ పట్టవనీ, ఆయనకు ఫామ్ హౌస్ లో కూర్చుని మందుకొట్టడం మాత్రమే తెలుసని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని తాగుబోతు సీఎం నుంచి విముక్తి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గం శివ్వంపేటలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రోడ్ షో లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. నర్సాపూర్‌ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్‌ మాట తప్పారని వ్యాఖ్యానించారు.

కర్రు కాల్చి కారు గుర్తుకు వాత పెట్టాల్సిన సందర్భం వచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్‌ దగ్గర గులాం గిరి చేసే మదన్‌ రెడ్డి కావాలో.. అసెంబ్లీలో నర్సాపూర్‌ సమస్యల కోసం కొట్లాడే సునీతా రెడ్డి కావాలో తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రజల ఆశీస్సులతో నర్సాపూర్‌లో కాంగ్రెస్‌ జెండాను ఎగరేస్తామని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు కాంగ్రెస్ నేత సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..బంగారు తెలంగాణలో మహిళలు మెడలో పుస్తెల తాడు అమ్ముకోవాల్సిన దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జనం చచ్చారో, బతికారో పట్టించుకోని కేసీఆర్‌కు ఓటు వేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Telangana
Revanth Reddy
Congress
KCR
TRS
liquor
critise
angry
medak
narsapur
constitutency
releive
state
farm house

More Telugu News