TRS: టీఆర్ఎస్ లో హరీష్ రావు ఇమడలేకపోతున్నారు.. ఆ పార్టీ చీలిపోవడం ఖాయం: టీడీపీ నేత రేవూరి

  • టీఆర్ఎస్ లో అంతర్యుద్ధం జరుగుతోంది
  • ఆ పార్టీలో హరీష్ కు అవమానం జరుగుతోంది
  • సరైన సమయంలో పార్టీ నుంచి హరీష్ బయటకు రావొచ్చు
టీఆర్ఎస్ లో అంతర్యుద్ధం జరుగుతోందని టీడీపీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అసలు సిసలైన నాయకుడు హరీశ్ రావు అని, అటువంటి నాయకుడు టీఆర్ఎస్ లో ఇమడలేకపోతున్నారని, ఎప్పటికైనా ఆ పార్టీ చీలిపోవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, ప్రజాకూటమికి సమానంగా సీట్లు వస్తే.. టీఆర్ఎస్ లో కొందరిని తీసుకుని వచ్చి హరీష్ రావు సీఎం అవుతాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కనుక బతికి ఉన్నట్టయితే, హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరేవారేనని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ లో ఆయనకు అవమానం జరుగుతున్నప్పటికీ విధిలేని పరిస్థితుల్లో ఆ పార్టీలో ఆయన కొనసాగుతున్నారని, సరైన సమయం చూసుకుని పార్టీ నుంచి ఆయన బయటకు రావొచ్చని వ్యాఖ్యానించారు.
TRS
Harish Rao
Telugudesam
revuri prakash reddy

More Telugu News