patanjali: దుస్తుల వ్యాపారంలోకి పతంజలి.. రూ. 7వేల విలువైన దుస్తులు రూ. 1100లకే!

  • ఆన్ లైన్లో నాణ్యమైన స్వదేశీ కాటన్ దుస్తుల అమ్మకాలను ప్రారంభించిన పతంజలి
  • విదేశీ కంపెనీల దోపిడీకి అడ్డుకట్ట వేద్దామన్న బాబా రాందేవ్
  • స్వదేశీ ఉద్యమంలో భాగస్వాములు కావాలంటూ పిలుపు

వివిధ రకాల ఉత్పత్తులను అందిస్తూ, ఇప్పటికే వినియోగదారుల అభిమానాన్ని పతంజలి సంస్థ సొంతం చేసుకుంది. త్వరలోనే దుస్తుల విభాగంలోకి కూడా ప్రవేశిస్తామని ప్రకటించిన పతంజలి... చెప్పినట్టుగానే ఆన్ లైన్ లో నాణ్యమైన స్వదేశీ కాటన్ దుస్తుల అమ్మకాలను ప్రారంభించింది.

 ఈ సందర్భంగా బాబా రాందేవ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, స్వదేశీ గౌరవాన్ని చాటుదామంటూ పిలుపునిచ్చారు. రూ. 7వేల విలువైన దుస్తులను (1 జీన్స్ ప్యాంట్, 2 టీషర్టులు) పతంజలి ద్వారా కేవలం రూ. 1100లకే పొందవచ్చని చెప్పారు. విదేశీ కంపెనీల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు స్వదేశీ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News