మేనకాగాంధీ మాటలు ఘాటుగా ఉన్నాయి.. అయినా, ఆమెను అర్థం చేసుకోగలను: మహారాష్ట్ర సీఎం
- పులిని చంపిన ఘటనపై మండిపడ్డ మేనకాగాంధీ
- జంతు ప్రేమికురాలైన మేనక ఆవేదనను అర్థం చేసుకోగలనన్న ఫడ్నవిస్
- పులిని చంపాలనే నిర్ణయం తమను కూడా బాధించిందన్న సీఎం
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ, పులిని చంపాలనే నిర్ణయం తీసుకోవడం తమను కూడా బాధిస్తోందని చెప్పారు. ఈ విషయంలో ఏదైనా పొరపాటు జరిగిందేమో అనే కోణంలో విచారణ కొనసాగుతోందని అన్నారు. మేనకాగాంధీ వ్యాఖ్యలు ఘాటుగా ఉన్నప్పటికీ... ఓ జంతు ప్రేమికురాలిగా ఆమె ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని ఫడ్నవిస్ చెప్పారు.