Darul Uloom: గోళ్లు కత్తిరించుకోవడం, నెయిల్ పాలిష్ వేసుకోవడంపై నిషేధం.. ముస్లిం మహిళలపై కొత్త ఫత్వా జారీ

  • ముస్లిం మహిళలు బ్యూటీ పార్లర్లకు వెళ్లడం ఎక్కువవుతోంది
  • పరాయి పురుషులను ఆకర్షించేలా తయారు కావడం ఇస్లాంకు వ్యతిరేకం
  • ముస్లిం మహిళలపై ఫత్వా జారీ చేసిన దారుల్ ఉలూమ్

ఇప్పటికే మహిళలపై పలు ఆంక్షలను విధించిన దారుల్ ఉలూమ్ దియోబంద్... తాజాగా మరో ఫత్వా జారీ చేసింది. ముస్లిం మహిళలు గోళ్లు కత్తిరించుకోకూడదని, నెయిల్ పాలిష్ వాడకూడదని ఆదేశించింది. అయితే, గోరింటాకు పెట్టుకోవడంపై మాత్రం నిషేధం ఉండదని తెలిపింది. గోళ్తు కత్తిరించుకోవడం, గోళ్లకు రంగులు వేసుకోవడం ఇస్లాంకు వ్యతిరేకమని దారుల్ ఉలూమ్ సభ్యుడు ముఫ్తి ఇష్రార్ గౌరా తెలిపారు.

పురుషులు షేవింగ్ చేసుకోవడం ఇస్లాంకు ఎలా వ్యతిరేకమో... ముస్లిం మహిళలు కనుబొమ్మలను ట్రిమ్ చేసుకోవడం, లిప్ స్టిక్ వేసుకోవడం కూడా అలాగే వ్యతిరేకమని ముఫ్తి ఇష్రార్ తెలిపారు. భారత్ లో బ్యూటీ పార్లర్లకు వెళ్తున్న ముస్లిం మహిళల సంఖ్య పెరుగుతోందని, ఇది సరైంది కాదని, వెంటనే వీటిని ఆపాలని ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్ లోని షహరాన్ పూర్ కేంద్రగా దారుల్ ఉలూమ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

గత ఏడాది కూడా ముస్లిం మహిళలపై దారుల్ ఉలూమ్ ఓ ఫత్వాను జారీ చేసింది. కనుబొమ్మలను కత్తిరించుకోవడం, ట్రిమ్ చేసుకోవడం వంటివి చేయకూడదని ఆంక్షలు విధించింది. బ్యూటీ పార్లర్లకు ముస్లిం మహిళలు వెళ్లరాదని ఆదేశించింది. పరాయి పురుషులను ఆకర్షించే విధంగా మహిళలు తయారుకావడం ఇస్లాంకు వ్యతిరేకమని తెలిపింది. 

More Telugu News