Congress: నాటి ఎన్టీఆర్ కోరికను నేడు తీర్చిన చంద్రబాబు: మాజీ ఎంపీ చింతా మోహన్

  • కాంగ్రెస్ తో పొత్తు ఎన్టీఆర్ చివరి కోరిక
  • 1995లో కలసి వెళ్లాలని అనుకున్నారు
  • ఇంతకాలానికి అది నెరవేరిందన్న చింతా మోహన్
కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్నది ఎన్టీఆర్ చివరి కోరికని, నేడు దాన్ని చంద్రబాబు నెరవేర్చారని మాజీ ఎంపీ చింతా మోహన్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, టీడీపీ, కాంగ్రెస్ కలయికను ఆహ్వానిస్తున్నామని అన్నారు.

1995లో కాంగ్రెస్ తో కలసి ఎన్నికలకు వెళ్లాలని ఎన్టీఆర్ భావించారని, అప్పట్లో అది కుదరలేదని వ్యాఖ్యానించిన ఆయన, కాంగ్రెస్ కు ద్రోహం చేసిన జగన్ కన్నా చంద్రబాబు ఎంతో మేలని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లిన వారంతా తిరిగి వెనక్కు రావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. తదుపరి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందన్న నమ్మకం తనకుందని చింతా మోహన్ వ్యాఖ్యానించారు.
Congress
Telugudesam
NTR
Chinta Mohan
Chandrababu

More Telugu News