Saleem: రెండు మూడు రోజుల్లోనే శ్రీనివాసరావుకు బెయిల్: న్యాయవాది సలీమ్

  • కోర్టులో పిటిషన్ దాఖలు
  • శ్రీనివాస్ మానసిక స్థితి బాగాలేదు
  • బెయిల్ ఇవ్వాలని కోరిన సలీమ్
మరో రెండు మూడు రోజుల్లోనే శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు అవుతుందని, ఆయన తరఫున కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది సలీమ్ తెలిపారు. జగన్ పై హత్యాయత్నం చేసిన కేసులో ప్రస్తుతం విశాఖ జైలులో శ్రీనివాస్ ను ఉంచిన సంగతి తెలిసిందే. ఆయన మానసిక పరిస్థితి బాగాలేదని, బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరిన సలీమ్, ఈ పిటిషన్ పై అతి త్వరలోనే నిర్ణయం వెలువడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తన క్లయింట్ బలహీనుడని, సాక్ష్యాలు నాశనం చేసే అవకాశం అతనికి లేదని, ఇప్పటికే కస్టడీలో తమకు తెలిసిన అన్ని విషయాలనూ చెప్పాడని ఆయన అన్నారు.
Saleem
Court
Bail
Srinivasa Rao
Vizag
Jagan
Murder Attempt

More Telugu News