'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో లక్ష్మీ పార్వతి ఈమే!
- నటించనున్న రూపాలీ సూరి
- ముంబైలో మోడల్ గా గుర్తింపు
- ఇటీవలే చిత్రం పూజా కార్యక్రమాలు
ఇటీవల తిరుపతిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించి, సంక్రాంతి నాటికి సినిమాను సిద్ధం చేయాలన్నది వర్మ ఆలోచన. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను ఎవరు చేస్తున్నారన్న విషయం ఇంకా వెల్లడి కాలేదు. చంద్రబాబు పాత్ర కోసం ఓ చిన్న హోటల్ కార్మికుడిని ఆయన ఎంపిక చేసుకున్నాడు. లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన తరువాత జరిగిన సంఘటనలే ఇతివృత్తంగా ఈ చిత్రం రూపొందనుంది.