RJD: భార్యతో విడాకులు.. లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ సంచలన వ్యాఖ్యలు

  • ఐశ్వర్యకు నా కుటుంబ సభ్యుల మద్దతు ఉంది
  • నాకెవరూ సపోర్ట్ చేయడం లేదు
  • నా వెనక కుట్ర జరుగుతోంది

ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భార్య ఐశ్వర్య రాయ్‌తో విడాకుల వ్యవహారంతో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిన ఆయన.. తన కుటుంబంపైనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబ సభ్యులే తనపై కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

 రెండు నెలులుగా ఐశ్వర్య పుట్టింటిలోనే ఉందని, అప్పటి నుంచి ఆమెతో తనకు మాటలు లేవని పేర్కొన్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా తమ ఇంట్లో వాలిందని, అందరూ ఆమెను సమర్థిస్తున్నారని వాపోయారు. తనను సమర్థించాల్సింది పోయి.. అందరూ ఆమెకే మద్దతు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదంతా చూస్తుంటే ఏదో కుట్రలా అనిపిస్తోందని, తల్లీ, చెల్లి, తండ్రి అందరూ ఆమెనే సమర్థిస్తుండడం వెనక ఏదో కుట్ర దాగి ఉందని అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నెల 2న పాట్నా కుటుంబ న్యాయస్థానంలో తేజ్ ప్రతాప్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత నేరుగా రాంచీ వెళ్లి రిమ్స్‌లో చికిత్స పొందుతున్న తండ్రి లాలును కలిసి విషయం చెప్పారు.

 అయితే, తొందరపడొద్దని, పాట్నా వచ్చే వరకు ఆగాలని, అందరం కలిసి కూర్చుని మాట్లాడుకున్నాక నిర్ణయం తీసుకుందామని ఆయన చెప్పారని తేజ్ ప్రతాప్ తెలిపారు. అయినప్పటికీ తన నిర్ణయం మార్చుకోలేదని స్పష్టం చేశారు.

More Telugu News