Lakshmi Parvathi: లక్ష్మీ పార్వతి జగన్ కాళ్ల దగ్గర కూర్చుంటే ఎన్టీఆర్ ఆత్మ క్షోభించలేదా?: కేఈ కృష్ణమూర్తి

  • కేఈ కృష్ణమూర్తి ప్రజలకు బహిరంగ లేఖ
  • హక్కులను కాపాడుకోవాలనుకోవడం తప్పా?
  • బీజేపీ చేతిలో వైసీపీ కీలుబొమ్మగా మారింది

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీఎం చంద్రబాబు భేటీపై ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. దీనికి సమాధానమిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. లేఖలో పలు ప్రశ్నలను ప్రతిపక్షాలపై సంధించారు.

‘‘రాహుల్‌ని చంద్రబాబు కలిస్తే తప్పేంటి? విభజన చట్టంలోని హామీలను విస్మరించి మనల్ని మోసం చేసిన వారిపై తిరగబడి మన హక్కులను కాపాడుకోవాలనుకోవడం తప్పా? ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి కాంగ్రెస్‌లో చేరి మంత్రి పదవి తీసుకున్నప్పుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించలేదా? అనంతరం ఆమె పార్టీ మారి బీజేపీలో చేరినపుడు బాధపడలేదా?

 లక్ష్మీ పార్వతి జగన్ కాళ్ల దగ్గర కూర్చుంటే ఎన్టీఆర్ ఆత్మ బాధపడలేదా? ఒక్క టీడీపీ మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందా?’’ అని లేఖలో కేఈ ప్రశ్నల వర్షం కురిపించారు. బీజేపీ చేతిలో వైసీపీ కీలుబొమ్మగా మారిందని ఆయన విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా చంద్రబాబు చేస్తున్న కృషిని ప్రజలు అర్థం చేసుకోవాలని కేఈ కోరారు.

More Telugu News