Bollywood: ‘కేదార్ నాథ్’ సినిమాను ఆపేయండి.. ముద్దు సీన్లపై ఆలయ పూజారుల ఆగ్రహం!

  • ఇది లవ్ జిహాద్ ను ప్రోత్సహించేలా ఉంది
  • మా మనోభావాలను దెబ్బతీసేలా షూట్ చేశారు
  • నిషేధించకుంటే ఆందోళనకు దిగుతాం

బాలీవుడ్ సినిమా పద్మావత్ పై చెలరేగిన వివాదం మర్చిపోకముందే మరో సినిమా ఇబ్బందుల్లో చిక్కుకుంది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్, నటి సారా అలీఖాన్ జంటగా అభిషేక్ కపూర్ తెరకెక్కించిన ‘కేదార్ నాథ్’ సినిమాను నిషేధించాలంటూ కేదార్ నాథ్ ఆలయ అర్చకులు డిమాండ్ చేస్తున్నారు. ఇందులోని సన్నివేశాలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు. 2013లో ఉత్తరాఖండ్ భారీ వరదల సందర్భంగా చాలామంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ వరదల నేపథ్యంలో ఓ యువతీ,యువకుడి మధ్య నడిచే ప్రేమ కథతో ‘కేదార్ నాథ్’ సినిమాను తెరకెక్కించారు.

ఇటీవల విడుదలైన కేదార్ నాథ్ సినిమా టీజర్ పై ఆలయ పూజారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను నిషేధించకపోతే భారీగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ సినిమా లవ్ జిహాద్ ను ప్రేరేపించేలా, తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమా పోస్టర్‌లో ముస్లిం యువకుడు, హిందూ యువతిని మోసుకెళుతున్నట్లు చూపించారు. అసలు కేదార్ నాథ్ కు ముస్లింలే రారని వ్యాఖ్యానించారు. అలాంటిది వేలాదిమంది వరదల్లో కొట్టుకునిపోతుంటే మధ్యలో ముద్దు సీన్లను పెట్టారన్నారు.

More Telugu News