Chandrababu: ఇదేంటో కాస్త క్లారిటీ ఇస్తారా?: చంద్రబాబుపై పవన్ కల్యాణ్ సెటైర్లు

  • బీటలు వారిన పోలవరం రోడ్డు
  • మీ రియల్ టైమ్ గవర్నెన్స్ టీమ్ గ్రహించిందా?
  • ట్విట్టర్ లో ప్రశ్నించిన పవన్ కల్యాణ్
పోలవరం ప్రాజెక్టుకు దారితీసే రహదారి ఒక్కసారిగా బీటలు వారడంపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ చంద్రబాబును టార్గెట్ చేసుకుని సెటైర్లు వేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్న చంద్రబాబు రియల్‌ టైమ్ గవర్నెన్స్‌ పోలవరం రోడ్డు ఘటనపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

"కిలోమీటర్‌ మేరకు ఇంత దారుణంగా రోడ్డు దెబ్బతినడాన్ని రియల్‌ టైమ్ గవర్నెన్స్‌ టీమ్‌ గ్రహించిందా?  కారణాలేంటో చెప్తారా? కొంపతీసి పోలవరం ప్రాంతంలో భూకంపం వచ్చిందంటారా? ప్రజలను అయోమయంలో పడేయకుండా.. కొంచెం క్లారిటీ ఇవ్వండి" అని ఆయన కోరారు. పోలవరం రహదారి దెబ్బతిన్న వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు.
Chandrababu
Pawan Kalyan
Twitter
Polavaram

More Telugu News