Petrol: ఇంకాస్త తగ్గిన పెట్రోలు ధరలు!

  • 21 పైసల మేరకు తగ్గిన పెట్రోలు ధర
  • 17 పైసలు తగ్గిన లీటర్ డీజిల్ ధర
  • మరికొంతకాలం ఇలాగే అంటున్న నిపుణులు

అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో క్రూడాయిల్ ధరలు తగ్గుతుండగా, ఆ ప్రభావం భారత చమురు కంపెనీలపైనా కనిపిస్తోంది. డాలర్ తో మారకపు విలువలో రూపాయి బలపడటం కూడా 'పెట్రో' ఉత్పత్తుల ధరలు దిగివచ్చేందుకు కారణమవుతోంది. ఇక ఆదివారం నాడు లీటరు పెట్రోలుపై 21 పైసలు డీజిల్ పై 17 పైసల మేరకు ధరను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఐఓసీ వెల్లడించింది. దీంతో ఢిల్లీలో పెట్రోలు ధర రూ. 78.78కు, డీజిల్ ధర రూ. 73.36కి చేరగా, ముంబైలో పెట్రోలు ధర రూ. 84.28, డీజిల్ ధర రూ. 76.88కు తగ్గింది.

ఇదే సమయంలో చెన్నైలో పెట్రోలు ధర రూ. 81.84, డీజిల్ ధర రూ. 77.55గా ఉండగా, కోల్ కతాలో పెట్రోలు ధర లీటరుకు రూ. 80.68, డీజిల్ రూ. 75.22 వద్ద కొనసాగుతున్నాయి. ధరల తగ్గుదల మరింత కాలం కొనసాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, గడచిన రెండు వారాల వ్యవధిలో పెట్రోలు ధర సుమారు రూ. 3.50, డీజిల్ ధర రూ.2 మేరకు తగ్గడం గమనార్హం.

More Telugu News