Kerala: శబరిమలలో టెన్షన్.. హోటల్స్ బుక్ చేసిన మహిళా సంఘాల నేతలు.. గవర్నర్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే జార్జ్!

  • రేపు పూజల కోసం తెరచుకోనున్న ఆలయం
  • మహిళలు వస్తున్నారన్న స్థానిక ఎమ్మెల్యే
  • 144 సెక్షన్ విధించిన పోలీసులు

కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయ్యప్పస్వామి ఆలయాన్ని రేపు పూజల కోసం తెరవనున్న నేపథ్యంలో భక్తులు సైతం భారీగా చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలు ఆలయంలోకి వెళ్లేందుకు యత్నిస్తున్నట్లు వార్తలు రావడం కలకలం రేపుతోంది. ఆలయంలోకి వెళ్లేందుకు 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు సిద్ధమైనట్లు స్థానిక ఎమ్మెల్యే జార్జ్ గవర్నర్ కు లేఖ రాశారు.

దీని కారణంగా అల్లర్లు చెలరేగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. వీరందరిని ఖాళీ చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో నీలక్కల్ నుంచి పంబ వరకూ అధికారులు భారీగా పోలీసులను మోహరించారు. శబరిమల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. మరోవైపు నీలక్కల్ దగ్గరకు భారీ సంఖ్యలో చేరుకుంటున్న అయ్యప్ప భక్తులు 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను అడ్డుకుని తీరతామని స్పష్టం చేస్తున్నారు.

More Telugu News