Jagan security: విపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డికి మూడంచెల భద్రత: విజయనగరం ఎస్పీ పాలరాజు

  • చుట్టూ వలయంగా భద్రతా సిబ్బంది
  • అనుమతి ఉన్న వారికి మాత్రమే వలయం లోపలికి అనుమతి
  • విశాఖ ఎయిర్‌ పోర్టులో దాడి ఎఫెక్ట్‌
విజయనగరం జిల్లాలో త్వరలో పున:ప్రారంభంకానున్న ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, విపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డికి మూడంచెల భద్రత కల్పించనున్నట్లు విజయనగరం జిల్లా ఎస్పీ పాలరాజు తెలిపారు. జిల్లాలో యాత్ర కొనసాగుతుండగా, హైదరాబాద్‌ వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయానికి వచ్చిన జగన్‌పై శ్రీనివాస్‌ అనే వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే.

వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న జగన్‌ యాత్రను తిరిగి పున:ప్రారంభించాక ఈ విధమైన భద్రత కొనసాగిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్‌ చుట్టూ భద్రతా సిబ్బంది వలయంగా ఉంటారని, ఆ వలయంలోకి ముందుగా అనుమతి తీసుకున్న వారి ప్రవర్తను పరిశీలించాక మాత్రమే పంపిస్తామని తెలిపారు.
Jagan security
vizianagaram sp

More Telugu News