Micromax tv: మైక్రోమాక్స్ నుండి మొట్ట మొదటి గూగుల్ సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టీవీ విడుదల!

  • 49", 55" లలో మార్కెట్లో లభ్యం
  • 49 ఇంచ్ టీవీ ధర రూ.51,990
  • 55 ఇంచ్ టీవీ ధర.61,990
మైక్రోమాక్స్ సంస్థ మొట్ట మొదటి గూగుల్ సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టీవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. 4కే యూ.హెచ్.డీ గల ఈ టీవీ 49 ఇంచ్, 55 ఇంచ్ లలో మార్కెట్లో లభించనుంది. 49 ఇంచ్ గల టీవీ ధర రూ.51,990 ఉండగా, 55 ఇంచ్ గల టీవీ ధర.61,990గా ఉంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టంపై నడిచే ఈ టీవీలో డాల్బీ/డీటీఎస్ సౌండ్ సిస్టంలు కలిగి ఉన్నాయి. దీనిలో ఏర్పాటు చేసిన హైడైనమిక్ రేంజ్ టెక్నాలజీ వలన టీవీ పిక్చర్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుందని సంస్థ అధికారులు తెలిపారు. అలాగే దీనిలో 2.5 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ తో పాటు సరికొత్త కార్టెక్స్ ఏ53 ప్రాసెసర్ ని అమర్చారు. వాయిస్ ఎనేబుల్డ్ సెర్చ్, బ్లూటూత్, వైఫై లాంటి ప్రత్యేకతలు కూడా దీనిలో ఉన్నాయి.
Micromax tv
android tv
smarttv
technology
Tech-News

More Telugu News