mahakutami: మహాకూటమి తరపున ఇద్దరు మైనార్టీలకు టీడీపీ టికెట్లు : తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌.రమణ

  • చార్మినార్‌, మలక్‌పేట స్థానాలు కేటాయించనున్నట్లు వెల్లడి
  • 8 లేదా 9వ తేదీన అభ్యర్థుల జాబితా 
  • అనారోగ్యంతో బాధపడుతున్న సామా రంగారెడ్డికి పరామర్శ
మహాకూటమి తరపున ఇద్దరు మైనార్టీలకు టికెట్లు కేటాయించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించినట్లు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ కీలక ప్రకటన చేశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డిని శుక్రవారం రావుల చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి ఆయన పరామర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ చార్మినార్‌, మలక్‌పేట స్థానాలు కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈనెల 8 లేదా 9వ తేదీన అభ్యర్థుల జాబితా వెలువడనుందని చెప్పారు. చార్మినార్‌ నుంచి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలీ మస్కతిని, మలక్‌పేట నుంచి మహ్మద్‌ ముజఫర్‌ అలీఖాన్‌ను రంగంలోకి దింపాలని నిర్ణయించినట్లు తెలిపారు.
mahakutami
Telugudesam
two tickets for minorities

More Telugu News