teacher fire: విద్యార్థినిపైకి ఆగ్రహంతో స్కేలు విసిరిన టీచర్‌... కుడి కంటికి గాయం!

  • తనపై రీఫిల్‌ పడిందన్న కోపంతో ప్రతిచర్య
  • స్కేలు పదునైన భాగం తగలడంతో రక్తస్రావం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు
చిన్నపొరపాటు...కాస్త సంయమనం పాటిస్తే పోయేది...విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆ టీచర్‌లో అవి కొరవడ్డాయి. బాలిక తప్పు చేసిందని భావించగానే చేతికి అందిన స్కేలు ఆమెపైకి విసరడంతో పదునైన భాగం ఆమె కంటికి తగిలి గాయమైంది. వివాదం పోలీసుల వరకు వెళ్లింది.

పోలీసుల కథనం మేరకు హైదారాబాద్‌ లోని శివాజీనగర్‌ పరిధి రెజిమెంటల్‌ బజార్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో మోండా సాంబమూర్తి ప్రాంతానికి చెందిన పద్నాలుగేళ్ల బాలిక ప్రియాంక చదువుతోంది. గురువారం తరగతి గదిలో ఆమె రీఫిల్‌ పట్టుకునే క్రమంలో అది జారి ఉపాధ్యాయిని స్వరూపపై పడింది. ఈ ఘటనతో కోపం ఆపుకోలేని టీచర్‌ తన పక్కనే ఉన్న స్కేలు విద్యార్థినిపైకి విసిరింది. అదికాస్తా బాలిక కుడికంటి చివర్లో తగిలి గాయం కావడంతో రక్తస్రావం అయింది.

బాలికకు చికిత్స చేయించిన ఆమె తల్లిదండ్రులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈలోగా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు బాధితురాలి తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచడంతో వారు రాజీపడ్డారు. విషయాన్ని పోలీసులకు తెలియజేయగా అప్పటికే కేసు నమోదు చేశామని, వివాదం కోర్టులో తేల్చుకోవాలని వారు స్పష్టం చేసి పంపించారు.
teacher fire
scale thrown on student
Hyderabad

More Telugu News