Srikantha chari: ఉత్తమ్‌పై పోటీ చేయడం సాహసమే: శ్రీకాంతాచారి తల్లి

  • కేసీఆర్ అమరుల కుటుంబాలను ఇబ్బంది పెట్టలేదు
  • పార్టీతో సంబంధం లేని ఎన్నారై నాకు అడ్డొస్తున్నారు
  • మరోసారి సర్వే చేసి నాకు టికెట్ ఇవ్వాలి
సీఎం కేసీఆర్ అమరుల కుటుంబాలను ఆదుకున్నాడే తప్ప ఇబ్బంది పెట్టలేదని శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ పేర్కొన్నారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకుంటే అమరులకు అన్యాయం చేసినట్టవుతుందన్నారు. ఒకవేళ తనకు ఇవ్వడం కుదరకపోతే అప్పిరెడ్డికిచ్చినా తనకు అభ్యంతరం లేదన్నారు. పార్టీతో సంబంధం లేని ఎన్నారై ఒకరు తనకు అడ్డుగా వస్తున్నారని.. మరోసారి సర్వే చేసి తనకు టికెట్ ఇవ్వాలని శంకరమ్మ కోరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పోటీ చేయడమంటే సాహసమేనని, కానీ కేసీఆర్ ఆదేశిస్తే కనుక పోటీ చేస్తానని అన్నారు.

Srikantha chari
Shankaramma
KCR
Uttam Kumar Reddy

More Telugu News