sai dharam tej: తేజు కోసం రంగంలోకి దిగిన చిరూ!
- చిరూ ముందుకు 'చిత్రాలహరి' కథ
- మార్పులు చేర్పులు చెప్పిన చిరూ
- కథపై కసరత్తు చేస్తోన్న కిషోర్ తిరుమల
వరుస పరాజయాలతో సాయిధరమ్ తేజ్ సతమతమవుతున్నాడు. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నాడు. తన తదుపరి సినిమాను కిషోర్ తిరుమలతో కలిసి చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి 'చిత్రలహరి' అనే టైటిల్ ను ఖాయం చేశారు.
సాధారణంగా తేజు తన సినిమాల ఎడిటింగ్ సమయంలో చిరూకి చూపించి సలహాలు .. సూచనలు అడిగేవాడు. అలాంటిది 'చిత్రలహరి' షూటింగుకి ముందే కథను చిరంజీవికి చెప్పించాడట. దాంతో చిరంజీవి కొన్ని మార్పులు .. చేర్పులు చెప్పినట్టుగా సమాచారం. ప్రస్తుతం వాటిని సెట్ చేసే పనిలోనే కిషోర్ తిరుమల వున్నాడని అంటున్నారు. మార్పులు చేర్పులు చిరంజీవికి సంతృప్తిని కలిగించిన తరువాతనే సెట్స్ పైకి వెళతారని తెలుస్తోంది.