Chilakaluripeta: 9న జరగాల్సిన వివాహం... చిలకలూరిపేట కానిస్టేబుల్ మల్లీశ్వరి ఆత్మహత్య

  • కాకుమానులోని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య
  • ప్రేమ వివాహాన్ని కాదని మరో సంబంధం నిశ్చయం
  • కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు
తనకు ఇష్టంలేని వివాహం నిశ్చయించారన్న మనస్తాపంతో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మల్లీశ్వరి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, చిలకలూరిపేట రూరల్ పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ విధుల్లో ఉన్న మల్లీశ్వరికి తల్లిదండ్రులు ఈ నెల 9న వివాహం జరిపించేందుకు నిశ్చయించారు.

ఈ నేపథ్యంలో నేటి ఉదయం కాకుమానులోని తన ఇంట్లో మల్లీశ్వరి, ఎలుకల మందు తిని విగతజీవిగా కనిపించింది. ఆమె ఓ యువకుడిని ఇష్టపడిందని, అతనికి ఇచ్చి వివాహం జరిపించేందుకు మల్లీశ్వరి తల్లిదండ్రులు నిరాకరించారని, అందుకే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లీశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, విచారణ ప్రారంభించారు.
Chilakaluripeta
Conistable
Malleshwari
Sucide
Marriage

More Telugu News