mulayam singh: ములాయం, అఖిలేష్ యాదవ్ లతో చంద్రబాబు భేటీ!

  • ఢిల్లీలో ములాయం, అఖిలేష్ ను కలిసిన చంద్రబాబు
  • తాజా రాజకీయ పరిణామాలపై చర్చ
  • బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై చర్చించిన నేతలు
ఢిల్లీలో ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్, ఆయన తనయుడు అఖిలేశ్ యాదవ్ తో ఈరోజు చంద్రబాబు భేటీ అయ్యారు. చంద్రబాబు వెంట టీడీపీ నేతలు కూడా ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించారు. బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై చర్చించారు. కాగా, ములాయం, అఖిలేష్ తో భేటీ అనంతరం సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో కూడా బాబు సమావేశమయ్యారు. ఢిల్లీలోని విమానాశ్రయంలో వారి భేటీ జరిగింది.

ఇదిలా వుండగా, ఢిల్లీలో చంద్రబాబు ఈరోజు చాలా బిజీగా గడిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తో భేటీ తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు అజిత్ సింగ్ తో సమావేశమయ్యారు. ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ ని కలిశారు. 
mulayam singh
akhilesh
Chandrababu

More Telugu News