Chandrababu: ఆ రోజున ‘కాంగ్రెస్’ మొహం కూడా చంద్రబాబు చూడరు: వట్టి వసంతకుమార్

  • కాంగ్రెస్-టీడీపీ పొత్తు ఫలించదు
  • తెలంగాణలో ఈ విషయం నిరూపితమవుతుంది
  •  తుపాకీ గుండుకు దొరక్కుండా బాబు తిరుగుతాడు
కాంగ్రెస్-టీడీపీ పొత్తు ఫలించదని, తెలంగాణలో జరిగే ఎన్నికల్లోనే ఈ విషయం నిరూపితమవుతుందని, ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మొహం కూడా చంద్రబాబు చూడరని, తుపాకీ గుండుకు దొరక్కుండా ఆయన తిరుగుతాడని జోస్యం చెప్పారు.

వైసీపీలో చేరేందుకు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారా? అనే ప్రశ్నకు ఆయన సమాధానిమిస్తూ, ‘రాజశేఖర్ రెడ్డి గారికి, నాకు ముప్పై సంవత్సరాల స్నేహం. నా స్నేహితుడి కొడుకు పార్టీ పెట్టుకుంటే అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. కారణమేంటంటే.. ఏనాడూ కూడా గాంధీ, నెహ్రూ కుటుంబాలను వదిలి బయటకు వెళ్లొద్దని ఆనాడు నాకు రాజశేఖర్ రెడ్డి చెప్పిన మాట అది. ఈ రోజున చంద్రబాబు వెళ్లి భుజంభుజం కలిపితే.. గతాన్ని మర్చిపోతామని రాహుల్ గాంధీ చెప్పడాన్ని జీర్ణించుకోలేకనే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొస్తున్నాను’ అని స్పష్టం చేశారు.
Chandrababu
Rahul Gandhi
vatti vasantha kumar

More Telugu News