జాతీయపార్టీలెన్ని కలిసినా బీజేపీని ఏం చేయలేవు: విష్ణుకుమార్‌రాజు
- అవకాశవాద రాజకీయాలు చేయడంలో దిట్ట
- ఆంధ్రాలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వరు
- టీడీపీతో పొత్తు కారణంగా కాంగ్రెస్ కు తీవ్ర నష్టం
జాతీయ స్థాయిలో ఎన్ని పార్టీలు కలిసినా బీజేపీని ఎవరూ ఏం చేయలేరన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎంత తప్పు చేశారో చంద్రబాబుకు డిసెంబర్ 11న తెలుస్తుందన్నారు. ఆంధ్రాలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వరని.. టీడీపీతో పొత్తు కారణంగా కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోతుందని విష్ణుకుమార్ రాజు తెలిపారు. కాంగ్రెస్‌తో పొత్తు లేకుంటే తెలంగాణలో టీడీపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదని ఎద్దేవా చేశారు.