sensex: లాభాలతో ప్రారంభమై.. నష్టాల్లోకి వెళ్లి.. ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు

  • లాభనష్టాల మధ్య ఊగిసలాడిన మార్కెట్లు
  • 10 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 6 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి లాభనష్టాల మధ్య ఊగిసలాడిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరకు ఫ్లాట్ గా ముగిశాయి. ఉదయం 160 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ ప్రారంభమైంది. అనంతరం అమ్మకాల ఒత్తిడితో ఒకానొక సమయంలో 100 పాయింట్ల వరకు నష్టపోయింది. చివరకు స్వల్ప నష్టాలతో మార్కెట్లు ముగిశాయి. సెన్సెక్స్ 10 పాయింట్లు కోల్పోయి 34,431కి పడిపోయింది. నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో 10,380 వద్ద స్థిరపడింది.

టాప్ గెయినర్స్:
పీసీ జువెలర్స్ (18.89%), రిలయన్స్ కమ్యూనికేషన్స్ (13.95%), కేఈఐ ఇండస్ట్రీస్ (13.91%), కల్పతరు పవర్ (11.45%), రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్ (9.86%).

టాప్ లూజర్స్:
మేఘమణి ఆర్గానిక్స్ (-14.65%), ఇన్ఫో ఎడ్జ్ ఇండియా (-5.52%), వక్రాంగీ (-5.00%), క్వాలిటీ (-4.85%), ఐసీఆర్ఏ లిమిటెడ్ (-4.56%).    

More Telugu News