manjubhargavi: నేను నాలాగే వుంటాను .. అందువలన కొన్ని అవకాశాలు పోయాయి కూడా!: మంజుభార్గవి

  • కాలు మీద కాలు వేసుకోవడం నాకు కంఫర్ట్ 
  • మా అమ్మ తిట్టినా అలాగే కూర్చునే దానిని 
  • అవకాశాలు పోయిన సందర్భాలు వున్నాయి

వెండితెరపై నటిగా మంజుభార్గవి కనిపించిన సినిమాలు తక్కువే. ఒక నృత్యకళాకారిణిగా లభించిన పేరు ప్రతిష్ఠలే ఎక్కువ. అలాంటి మంజు భార్గవి తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొని అనేక విషయాలను ముచ్చటించారు. ఈ ఇంటర్వ్యూలోనే "సెట్లో ఎంత పెద్ద హీరో వున్నా మీరు కాలుమీద కాలు వేసుకుని కూర్చుంటారట గదా? అందువలన కొన్ని అవకాశాలు పోయాయని అంటారు నిజమేనా?" అనే ప్రశ్న మంజుభార్గవికి ఎదురైంది.

అందుకు ఆమె స్పందిస్తూ .. "కాలు మీద కాలు వేసుకోవడమనేది నాకు అలవాటు. మా అమ్మ తిడుతూనే వుండేది .. డైరెక్టర్ గారు వున్నారు .. ప్రొడ్యూసర్ గారు వున్నారు అని. ఇలా కూర్చుంటే నాకు కంఫర్ట్ గా ఉంటుంది .. అందువలన ఇలాగే కూర్చుంటాను అని చెప్పేసి అలాగే కూర్చునే దానిని. అందువలన అవకాశాలు పోయిన మాట నిజమే. ఇక నా పద్ధతిలో నేను మాట్లాడటం వలన కూడా అవకాశాలు పోయిన సందర్భాలు వున్నాయి" అని చెప్పుకొచ్చారు.   

More Telugu News